వైజాగ్లో పార్టీ నేతలతో పవన్ సమావేశం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి విశాఖలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. నగరంలోని నోవోటెల్లో ఆదివారం రాత్రి సుమారు గంటపాటు ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు వర్తమాన రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం.
ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 20న జనసేన అధినేత భీమవరానికి వస్తారని ఆ పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు ఓ ప్రకటనలో తెలిపారు. ‘భీమవరం సమీపంలో పెదఅమిరంలోని నిర్మలాదేవి కల్యాణ మండపంలో జనసేన, టీడీపీ ముఖ్యనాయకులతో పవన్ సమావేశమవుతారు. పొత్తు నేపథ్యంలో ఇరు పార్టీల వ్యూహాలపై చర్చిస్తారు. 21వ తేదీ సాయంత్రం తిరిగి మంగళగిరి వెళ్తారు’’ అని గోవిందరావు వెల్లడించారు.